కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ కొనసాగుతున్న భూసర్వే.. రంగంలోకి రెవెన్యూ అధికారులు
- ఎర్రవల్లిలో భూములపై కొనసాగుతున్న రెవెన్యూ సర్వే
- సర్వే నంబర్ 325పై అధికారుల ప్రత్యేక దృష్టి
- మొత్తం 388 ఎకరాల భూముల పరిశీలన
- శాటిలైట్ మ్యాపింగ్‌తో భూముల హద్దుల పరిశీలన
- ఆక్రమణలని తేలితే భూముల స్వాధీనానికి చర్యలు
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూములపై రెవెన్యూ అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. ఎర్రవల్లితో పాటు వెంకటాపూర్, వరదరాజుపూర్ సరిహద్దుల్లో ఉన్న భూములను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో నిలిచిన సర్వే.. సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది.
సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మొత్తం 388 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూముల్లో ప్రభుత్వ భూమి ఎంత? అసైన్డ్ భూమి ఎంత? ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉంది? ప్రైవేటు పట్టా భూములు ఎంతమేర ఉన్నాయి? అనే వివరాలను సేకరిస్తున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ సుదర్శన్ రాథోడ్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సేవ్యానాయక్, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, స్థానిక తహసీల్దార్లతో కూడిన ప్రత్యేక బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. శాటిలైట్ మ్యాపింగ్, ఆధునిక సాంకేతికతతో పాటు పాత రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తూ భూముల హద్దులను నిర్ధారిస్తున్నారు.
సర్వే నంబర్ 325 పరిధిలో భూములు ఉన్న 100 మందికి పైగా రైతులకు ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలు, ఇతర యాజమాన్య పత్రాలతో సర్వే ప్రాంతానికి రావాలని సూచించారు.
ఫామ్‌హౌస్ పరిసర భూముల కేటాయింపులు, ధరణి రికార్డుల్లో అక్రమాలపై ఇటీవల అసెంబ్లీలో చర్చ జరిగిన నేపథ్యంలో ఈ విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సర్వే పూర్తయ్యాక సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి అందజేయనున్నారు. ప్రభుత్వ లేదా అసైన్డ్ భూములు ఆక్రమణకు గురైనట్లు తేలితే.. నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.