తెలంగాణ రైతులకు అలర్ట్.. సెప్టెంబర్ 30లోగా ఈ పని పూర్తి చేయాలి!
- సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు ప్రత్యేక క్యాంపెయిన్లు
- గ్రామాల్లోనే నమోదు చేసుకునే అవకాశం
- ఏఈఓ లేదా మీ సేవలోనూ రిజిస్ట్రేషన్
- ఆధార్, పాస్‌బుక్, మొబైల్ అవసరం
- ఫార్మర్ ఐడీతో పథకాలు, సబ్సిడీలు
తెలంగాణ రైతులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. రైతులకు ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు సులభంగా అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి రైతుకు ప్రత్యేకమైన ఫార్మర్ ఐడీ వస్తుంది.
రైతుల నమోదు కోసం సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అధికారులు గ్రామాల్లోకి వచ్చి రైతుల రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడే రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) వద్ద లేదా మీ సేవ కేంద్రంలోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వచ్చే ఫార్మర్ ఐడీ నంబర్‌ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పీఎం కిసాన్, రైతు భరోసా వంటి పథకాలకు ఈ ఐడీ అవసరం అవుతుంది.
రిజిస్ట్రేషన్‌కు ఏం కావాలి?
ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ అవసరం.
ఫార్మర్ ఐడీతో ఏం ఉపయోగం?
ఫార్మర్ ఐడీ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, సేవలు, రాయితీలు, సబ్సిడీలు పొందేందుకు ఉపయోగపడుతుంది. బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడంలోనూ ఇది సహాయపడుతుంది. ఎరువుల బుకింగ్‌కు ఉపయోగించే ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ యాప్‌లోనూ ఇది అవసరం. వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కనీస మద్దతు ధర పొందే ప్రక్రియలోనూ ఫార్మర్ ఐడీ ఉపయోగపడుతుంది.
ఫార్మర్ ఐడీ ఎలా తెలుసుకోవాలి?
ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు తమ ఫార్మర్ ఐడీని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ముందుగా ఫార్మర్ రిజిస్ట్రీ అధికారిక వెబ్‌సైట్‌ను తెరవాలి. ఆధార్ నంబర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ ఫార్మర్ ఐడీ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
కాబట్టి ఇప్పటికే నమోదు చేసుకోని రైతులు సెప్టెంబర్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.