యూరప్‌లో ‘వికసిత్ భారత్ రన్’.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాసులు
- యూరప్‌లోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో వికసిత్ భారత్ రన్
- సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం ఈ కార్యక్రమాల నిర్వహణ
- ఫ్రాంక్‌ఫర్ట్, జ్యూరిచ్, గ్లాస్గో నగరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాసులు
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ‘వికసిత్ భారత్’ స్ఫూర్తి విదేశీ గడ్డపై సైతం ప్రతిధ్వనిస్తోంది. సేవా పక్షోత్సవాల (సెప్టెంబర్ 17 - అక్టోబర్ 2) నేపథ్యంలో, ఐరోపాలోని పలు భారత రాయబార కార్యాలయాలు ఆదివారం ‘వికసిత్ భారత్ రన్ 2026’ను ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటారు.
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం, జర్మన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ఈ రన్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ శుచితా కిషోర్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రవాస భారతీయులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ ఆరంభంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రవాసులు ప్రతిజ్ఞ చేశారు.
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో భారత రాయబార కార్యాలయం, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ రన్‌ను నిర్వహించింది. వందేమాతరం గీతాలాపనతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అటు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ‘దేశ సేవ కోసం కమ్యూనిటీ రన్’ పేరిట రౌకెన్ గ్లెన్ పార్క్‌లో భారత కాన్సులేట్ కార్యాలయం ఈ పరుగును ఏర్పాటు చేసింది.
ఆరోగ్యం, శారీరక దృఢత్వంతో పాటు ప్రవాసులలో ఐక్యతను, దేశ నిర్మాణ స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వెల్లడించారు.