ఇండియా పోస్ట్ గిఫ్ట్‌ల స్కీమ్.. ఇది నిజమేనా?
- ఇండియా పోస్ట్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
- 'డాక్ సేవా గిఫ్ట్స్' స్కీమ్ పూర్తిగా అబద్ధమని వెల్లడి
- అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని పీఐబీ సూచన
- వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని ప్రజలకు హెచ్చరిక
- నకిలీ వార్తలపై ఫిర్యాదుకు వాట్సాప్ నంబర్ జారీ
సామాజిక మాధ్యమాల్లో 'ఇండియా పోస్ట్' పేరుతో ఒక సందేశం ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. 'డాక్ సేవా గిఫ్ట్స్' అనే పథకం కింద బహుమతులు పంపిణీ చేస్తున్నట్లు ఈ సందేశంలో పేర్కొన్నారు. అయితే, ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇది నకిలీ సందేశమని కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇటువంటి మోసపూరిత ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించింది.
'డాక్ సేవా గిఫ్ట్స్' పేరుతో ఇండియా పోస్ట్ ఎటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని, బహుమతులు లేదా లక్కీ డ్రాలు వంటివి నిర్వహించడం లేదని పీఐబీ తేల్చిచెప్పింది. ఇటువంటి సందేశాలతో పాటు వచ్చే అనుమానాస్పద లింకులు, వెబ్‌సైట్‌లపై క్లిక్ చేయవద్దని ప్రజలకు సూచించింది. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, ఆధార్ నంబర్ వంటి సున్నితమైన వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పీఐబీ విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద లింకులు, సందేశాలు, ఫొటోలు, వీడియోలు కనిపిస్తే, వాటి వాస్తవికతను నిర్ధారించుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్ 8799711259కు లేదా factcheck@pib.gov.in ఈమెయిల్ ఐడీకి పంపి సంప్రదించాలని కోరింది.