నందిగ్రామ్‌లో అనూహ్య మలుపు.. మమత మద్దతు ప్రకటించిన గంటల్లోనే కాంగ్రెస్‌ అభ్యర్థి అరెస్టు

నందిగ్రామ్‌లో అనూహ్య మలుపు.. మమత మద్దతు ప్రకటించిన గంటల్లోనే కాంగ్రెస్‌ అభ్యర్థి అరెస్టు

Unexpected twist in Nandigram Congress candidate arrested hours after Mamata announces support
  • నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్
  • 2007 నాటి భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలోని హత్య కేసులో అరెస్టు
  • ఇండియా కూటమిని బలోపేతం చేసేందుకే మద్దతని ప్రకటించిన మమత
  • తృణమూల్ పేరు, గుర్తును స్తంభింపజేసిన ఎన్నికల సంఘం
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగాయి. నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ మద్దతు కాంగ్రెస్‌కేనని మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ అరెస్ట్ జరగడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 2007 నాటి నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమం సమయంలో నమోదైన పాత హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు, కోల్‌కతాలోని తన నివాసంలో మమతా బెనర్జీ మీడియా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 6న జరిగే నందిగ్రామ్ ఉపఎన్నికలో తమ వర్గం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తుందని ఆమె వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి‌తో సమావేశమైన అనంతరం తమ వర్గం అభ్యర్థి సంచితా ప్రధాన్ డే పోటీ నుంచి తప్పుకోవడంతో మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ను 'సోదర పార్టీ'గా అభివర్ణించిన మమత, ఇండియా కూటమిని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ సందేశం బెంగాల్ నుంచే ప్రారంభం కావాలని వ్యాఖ్యానించారు.

మమత ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. మద్దతు ప్రకటించే స్వేచ్ఛ మమతకు ఉందని, అయితే తాము మాత్రం ఆమె మద్దతును కోరలేదని స్పష్టం చేశారు. వారి అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్న తర్వాతే మమత మద్దతు ప్రకటించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Advertisement
Milan Pradhan
Nandigram By Election
Mamata Banerjee
West Bengal Politics

More Telugu News