ఫుట్‌బాల్‌ ఆడిన ఏనుగు.. వినాయక చవితి వేళ వైరల్‌ అవుతున్న వీడియో..!

ఫుట్‌బాల్‌ ఆడిన ఏనుగు.. వినాయక చవితి వేళ వైరల్‌ అవుతున్న వీడియో..!

Elephant plays football viral video on Vinayaka Chavithi
  • అసోంలో ఫుట్‌బాల్‌ ఆడిన అడవి ఏనుగు వీడియో వైరల్‌
  • నుమాలిగఢ్‌లోని బోగిధాలాలో ఘటన
  • మైదానంలో బంతిని కాలితో తన్నిన గజరాజు
  • ఏనుగు చురుకుదనం చూసి స్థానికుల విస్మయం 
  • వినాయక చవితి సందర్భంగా వీడియోపై ప్రత్యేక ఆసక్తి
వినాయక చవితి వచ్చిందంటే గణపయ్యకు సంబంధించిన అలంకరణలు, పూజలు, సందడి కనిపిస్తాయి. కానీ ఈసారి అసోంలో మాత్రం ఓ గజరాజు తనదైన స్టైల్‌లో ఫుట్‌బాల్‌ ఆడిన వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. పిల్లలు ఫుట్‌బాల్‌ ఆడుతుండగా.. మైదానంలోకి వచ్చిన అడవి ఏనుగు.. బంతిని కాలితో తన్నుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. 

అసోంలోని గోలాఘాట్‌ జిల్లాలో ఉన్న నుమాలిగఢ్‌ బోగిధాలా ప్రాంతంలో ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. పచ్చని మైదానంలోకి వచ్చిన ఏనుగు.. అక్కడ ఉన్న ఫుట్‌బాల్‌ను చూసింది. అంతే.. బంతిని కాలితో తన్నుతూ అటూ ఇటూ తిరిగింది.

ఏనుగు బంతిని తన్నిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఓసారి ముందుకు తన్నడం.. మరోసారి దాని వెంట వెళ్లడం.. ఇలా కాసేపు గజరాజు ఫుట్‌బాల్‌తో సరదాగా గడిపింది. దాన్ని చూసిన స్థానికులు ఈ అరుదైన దృశ్యాన్ని వీడియోలో బంధించారు.

బంతిని తన్నడంలో దాని సమన్వయం, చురుకుదనం చూసి ఫిదా అవుతున్నారు. ఇక ఈరోజు వినాయక చవితి కావడంతో ఈ వీడియోకు ప్రత్యేకత ఏర్పడింది. పండుగ సందడి మొదలైన సందర్భంగా గజరాజు ఇలా ఫుట్‌బాల్‌ ఆడటం చూసి పలువురు భక్తులు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
Advertisement
Elephant
Assam
Football
Vinayaka Chavithi
Viral Video
Golaghat

More Telugu News