- బాదం పప్పుల వినియోగంలో ప్రపంచంలో మొదటి స్థానంలో అమెరికా
- రెండో స్థానంలో స్పెయిన్.. మూడో స్థానంలో భారత్
- ప్రపంచ మొత్తం వినియోగంలో అమెరికా వాటానే సుమారు 42 శాతం
- పోషకాహారంపై అవగాహన, ప్లాంట్-బేస్డ్ ఉత్పత్తుల వాడకంతో బాదంకు డిమాండ్
- స్వీట్లు, స్నాక్స్‌లో భారతీయులు ఎక్కువగా వాడినా, మొత్తం వినియోగంలో వెనుకంజ
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధతో డ్రై ఫ్రూట్స్ వాడకం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా బాదం పప్పుల వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. 2024 సంవత్సరానికి సంబంధించిన తాజా గణాంకాల ప్రకారం బాదం పప్పుల వినియోగంలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ మొత్తం వినియోగంలో సుమారు 42 శాతం వాటాతో అమెరికా ఈ జాబితాలో అగ్రపీఠం దక్కించుకుంది. ఏడాదికి సుమారు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బాదంను అమెరికన్లు వినియోగిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ జాబితాలో స్పెయిన్ రెండో స్థానంలో ఉండగా, భారత్ మూడో స్థానంలో నిలిచింది. మన దేశంలో బాదం వాడకానికి ప్రత్యేక స్థానం ఉంది. రోజువారీ స్నాక్స్‌గా, పండగల సమయంలో చేసే స్వీట్లు, పాయసంలో బాదంను విరివిగా ఉపయోగిస్తారు. అయినప్పటికీ, మొత్తం వినియోగంలో మాత్రం అమెరికా, స్పెయిన్ల కంటే భారత్ వెనుకబడింది.
ఒక దేశంలోని మొత్తం బాదం వినియోగాన్ని కేవలం తలసరి వాడకం ఆధారంగా కాకుండా, ఆ దేశ జనాభా, ఆహార శుద్ధి పరిశ్రమల సామర్థ్యం, బాదంతో తయారుచేసే ఉత్పత్తుల వైవిధ్యం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇటీవలి కాలంలో పోషకాహారంపై ప్రజల్లో పెరిగిన అవగాహన బాదం డిమాండ్‌ను అమాంతం పెంచింది.
ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారు బాదంను తమ ఆహారంలో తప్పనిసరి చేసుకుంటున్నారు. దీనికి తోడు పాలకు ప్రత్యామ్నాయంగా బాదం మిల్క్, గోధుమ పిండికి బదులుగా బాదం ఫ్లోర్ వంటి ప్లాంట్-బేస్డ్ ఉత్పత్తులకు ఆదరణ పెరగడం కూడా ప్రపంచవ్యాప్తంగా బాదం వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
స్నాక్స్, ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలలో కూడా బాదం వాడకం ఎక్కువ కావడంతో పలు దేశాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ఈ కారణాల వల్లే అమెరికా వంటి దేశాలు పారిశ్రామిక స్థాయిలో బాదంను ఎక్కువగా వినియోగిస్తూ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.