గోవా వెళ్లి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు అందుకున్న చిన్న శ్రీను
- గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో టీడీపీ నేత చిన్న శ్రీను భేటీ
- కుమార్తె సిరి సహస్రతో కలిసి ఆశీస్సులు అందుకున్న వైనం
- చంద్రబాబు, లోకేశ్, అశోక్ గజపతి రాజు సూచనలు పాటిస్తానన్న చిన్న శ్రీను
- వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు
ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గోవాలో జరిగిన ఈ భేటీలో ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా ఉన్నారు.
గోవాలోని గవర్నర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అశోక్ గజపతిరాజు.. చిన్న శ్రీనుకు, ఆయన కుమార్తెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా వారితో పాటు ఉండి, చిన్న శ్రీను కుటుంబానికి ఆతిథ్యం ఇచ్చారు.
సమావేశం అనంతరం చిన్న శ్రీను మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ఆదేశాలను, అలాగే అశోక్ గజపతిరాజు వంటి పెద్దల సూచనలను తాను తు.చ. తప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు. కేవలం ఆయన ఆశీస్సులు, మార్గనిర్దేశం కోసమే ప్రత్యేకంగా కలిసినట్లు వివరించారు.
కాగా, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు మేనల్లుడైన చిన్న శ్రీను, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి తన కుమార్తె సిరి సహస్రతో కలిసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఉండవల్లిలో చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత అశోక్ గజపతి రాజుతో చిన్న శ్రీను భేటీకి రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.