‘ఇరుముడి’ సక్సెస్: రవితేజను స్వయంగా అభినందించిన చిరంజీవి, రామ్ చరణ్

‘ఇరుముడి’ సక్సెస్: రవితేజను స్వయంగా అభినందించిన చిరంజీవి, రామ్ చరణ్

Chiranjeevi hosts Irumudi team at his residence photos inside
  • ‘ఇరుముడి’ చిత్ర బృందాన్ని కలిసి అభినందించిన చిరంజీవి, రామ్ చరణ్
  • ఇటీవల విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న ఇరుముడి
  • రవితేజ కెరీర్ లో మరో హిట్ సినిమా
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా కలిసి అభినందించారు. రవితేజ, దర్శకుడు శివ నిర్వాణతో పాటు ఇతర యూనిట్ సభ్యులతో వారు సమావేశమై సినిమా విజయం పట్ల తమ సంతోషాన్ని పంచుకున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, రామ్ చరణ్ స్వయంగా చిత్ర యూనిట్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి, సినిమా విడుదలైనప్పుడే చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ‘ఇరుముడి’ బృందాన్ని ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నేరుగా కలవడం ఇండస్ట్రీలో సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.

ఇటీవల చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ప్రియమైన తమ్ముడు రవితేజ 'త్రినాథ్' పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి సినిమాను తన భుజాలపై మోశాడు" అని కొనియాడారు. దర్శకుడు శివ నిర్వాణ కథను ఎంతో భావోద్వేగభరితంగా, లోతుగా తెరకెక్కించారని ప్రశంసించారు. చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన చిన్నారి నక్షత్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించారు. "ఒక సినిమా విజయం సాధిస్తే అది ఇండస్ట్రీలోని అందరికీ పండుగ లాంటిది" అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
Advertisement
Chiranjeevi
Ravi Teja
Ram Charan
Shiva Nirvana
Irumudi movie success
Irumudi team photos

More Telugu News