మోదీజీ.. హ్యాట్సాఫ్.. అంతర్జాతీయ దౌత్యం అంటే ఇదే: రవిశాస్త్రి
- బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ దౌత్యానికి రవిశాస్త్రి జేజేలు
- పుతిన్, జిన్‌పింగ్‌తో కలిసి మోదీ మొక్కలు నాటుతున్న ఫొటో షేర్
- భారతీయుడిగా ఎన్నడూ ఇంత గర్వపడలేదంటూ ట్వీట్
- ఇది మునుపెన్నడూ చూడని దౌత్యమని ప్రధానిని కొనియాడిన శాస్త్రి
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ప్రదర్శిస్తున్న అంతర్జాతీయ దౌత్యనీతిని కొనియాడాడు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో కలిసి ప్రధాని మోదీ మొక్కలు నాటుతున్న ఫొటోను రవిశాస్త్రి పంచుకున్నాడు. సదస్సు జరుగుతున్న ‘భారత్ మండపం’లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. "ఒక భారతీయుడిగా నేనెప్పుడూ ఇంత గర్వంగా ఫీల్ అవ్వలేదు. అధ్యక్షుడు పుతిన్, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, మన అద్భుతమైన ప్రధాని నరేంద్ర మోదీ అంతా మాతృభూమి భారత్‌లో ఒకేచోట ఉన్నారు. ఇది మునుపెన్నడూ చూడని అంతర్జాతీయ దౌత్యం. మోదీ జీ.. మీకు నా హ్యాట్సాఫ్" అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.
భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల అధినేతలు ఇందులో పాల్గొన్నారు. సదస్సులో భాగంగా నిన్న బ్రిక్స్ నేతలు ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026’ను ఆమోదించారు.
సదస్సు చివరి రోజైన నేడు ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా, కజకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, బురుండి, ఉగాండా, నైజీరియా వంటి దేశాలు ఉన్నాయి. భారత్ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన రవిశాస్త్రి, ఆ తర్వాత భారత జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఓ ప్రముఖ వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు.