రాష్ట్రం గర్వించే క్రీడాకారుడిని అవమానించొద్దు: జగన్ కు నారా లోకేశ్ హితవు
- డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై జగన్ ఆరోపణలకు మంత్రి లోకేశ్ కౌంటర్
- రాష్ట్రం గర్వించే క్రీడాకారుడిని అవమానిస్తున్నారని విమర్శ
- బాక్సర్ పెద్ద అప్పలరాజు నేషనల్ ఛాంపియన్ అని వెల్లడి
- ఆధారంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
- డీఎస్సీ స్కామ్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గట్టిగా బదులిచ్చారు. రాజకీయ విమర్శల కోసం రాష్ట్రం గర్వించదగ్గ క్రీడాకారుడిని అవమానించడం తగదని హితవు పలికారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
"పెద్ద అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ బాక్సర్. ఆయన నేషనల్ ఛాంపియన్. ఆయన సెమీఫైనల్ వీడియోలు ఇప్పటికీ దూరదర్శన్‌లో ఉన్నాయి. రాష్ట్రం గర్వించే క్రీడాకారుడిని అవమానించడం ఇప్పటికైనా ఆపండి జగన్ గారు" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలకు ఆధారంగా బాక్సర్ అప్పలరాజు ఆడుతున్న పాత వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని జగన్ ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. నిన్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
క్రీడల కోటాలో జరిగిన అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. అసలు జరగని క్రీడలకు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, కొందరికి పరీక్ష కూడా నిర్వహించకుండానే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఆ తప్పుడు సర్టిఫికెట్లను ధ్రువీకరించింది, నియామకాలు జరిపింది కూడా వారేనని విమర్శించారు. ఈ విషయంపై అధికారులు కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారని, సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అసలైనవో కావో నిర్ధారించలేకపోతున్నారని తెలిపారు. ఈ కుంభకోణంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎందుకు స్పందించడం లేదని జగన్ ప్రశ్నించిన నేపథ్యంలో, తాజాగా లోకేశ్ ఓ వీడియో ఆధారంతో కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.