ప్రసంగం మధ్యలో ఆగి.. జిన్‌పింగ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా.. అస‌లేం జ‌రిగిందంటే?

ప్రసంగం మధ్యలో ఆగి.. జిన్‌పింగ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా.. అస‌లేం జ‌రిగిందంటే?

PM Modi stops speech to inquire about Xi Jinping health
  • బ్రిక్స్ సదస్సులో ప్రసంగాన్ని మధ్యలో ఆపిన ప్రధాని మోదీ
  • అసౌకర్యంగా కనిపించిన జిన్‌పింగ్ ఆరోగ్యంపై ఆరా
  • 'ఆయన బాగున్నారా?' అని అనువాదకుడిని ప్రశ్నించిన మోదీ
  • జిన్‌పింగ్ తలూపడంతో ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని
  • ఆ తర్వాత విందుకు గైర్హాజరైన జిన్‌పింగ్
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఈ ఘటన శనివారం సదస్సు ప్రారంభ సెషన్‌లో జరిగింది.

మోదీ ప్రసంగిస్తుండగా, వేదికపై ఉన్న జిన్‌పింగ్ కాస్త అసౌకర్యంగా కనిపించడాన్ని గమనించారు. వెంటనే ప్రసంగానికి విరామం ఇచ్చి, జిన్‌పింగ్ వైపు తిరిగారు. ఆయన పక్కనే ఉన్న అనువాదకుడిని ఉద్దేశించి, "ఆయన బాగున్నారా?" అని మోదీ ప్రశ్నించారు. కొద్ది క్షణాల తర్వాత మరోసారి అదే ప్రశ్న అడగగా, జిన్‌పింగ్ తలూపి ఫర్వాలేదని సూచించారు. అనంతరం మోదీ తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఈ దృశ్యాలు దూరదర్శన్ ప్రసారం చేసిన ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.

అయితే, జిన్‌పింగ్ అసౌకర్యానికి గురికావడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఇరు నేతలు ద్వైపాక్షిక సమావేశంలో కూడా పాల్గొన్నారు. కాగా, సదస్సు అనంతరం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన గాలా డిన్నర్‌కు జిన్‌పింగ్ హాజరుకాలేదు. వరుస కార్యక్రమాలతో అలసిపోవడంతో ఆయన విశ్రాంతి కోసం హోటల్‌కు తిరిగి వెళ్లినట్లు సమాచారం.
Advertisement
Narendra Modi
Xi Jinping
BRICS Summit
Bharat Mandapam
India China Relations
Xi Jinping Health

More Telugu News