ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన.. హెచ్ఎం సహా ముగ్గురిపై వేటు
- పోలవరం జిల్లా ఆశ్రమ పాఠశాలలో గర్భం దాల్చిన బాలిక
- ప్రభుత్వం సీరియస్.. ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్
- హెచ్ఎం, వార్డెన్, టీచర్‌ను సస్పెండ్ చేసిన సర్కార్
- బాలికను గర్భవతి చేసిన వంట మనిషిపై పోక్సో కేసు
పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) రుక్మాండయ్య వివరాలు వెల్లడించారు. పాఠశాల హెచ్ఎం దూడ శాంతమతి, హాస్టల్ వార్డెన్ పల్లాల విజయగంధం, తరగతి ఉపాధ్యాయురాలు కాకూరి లోవమ్మలను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు.
ఈ దారుణానికి పాల్పడిన పాఠశాల వంట మనిషి మంగరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రుక్మాండయ్య పేర్కొన్నారు. బాధితురాలికి అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతోందని, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.