- ఏఐ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కృతి సనన్
- తన వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణకు పిటిషన్
- టెక్నాలజీపై ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నటి
ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగంపై న్యాయపోరాటానికి దిగారు. తన వ్యక్తిత్వ, ప్రచార హక్కులను (పర్సనాలిటీ అండ్ పబ్లిసిటీ రైట్స్) కాపాడాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తన అనుమతి లేకుండా డీప్‌ఫేక్ వీడియోలు, ఫేక్ ఎండార్స్మెంట్లు సృష్టించకుండా అడ్డుకోవాలని ఆమె కోరారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యక్తిత్వ హక్కులకు సంబంధించిన అంశాలపై మరిన్ని వివరాలు, గత తీర్పులను సమర్పించాలని కృతి తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన కృతి సనన్, ఏఐ టెక్నాలజీ తనను తీవ్రంగా భయపెడుతోందని వ్యాఖ్యానించారు. "ఏఐ ఒక పదునైన కత్తి లాంటిది, అది ఎంత పదునుగా ఉంటే అంత ప్రమాదకరం" అని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో ఏఐ ద్వారా సృష్టించిన తన ఫొటోలను రిపోర్ట్ చేయడానికి సరైన నిబంధనలు కూడా లేవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.