బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy Unveils Bathukamma Young Film Makers Challenge 2026 Poster
  • బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని ప్రచారం చేసే ఛాలెంజ్
  • అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న కోమటిరెడ్డి
  • తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలని ఆకాంక్ష

తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026’ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ చైర్మన్ గిరిధర్‌ రెడ్డిలతో కలిసి సచివాలయంలో ఈ ఛాలెంజ్ అధికారిక పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... షార్ట్ ఫిలింలు, బతుకమ్మ పాటలు, సృజనాత్మక వీడియోల ద్వారా తమ ప్రతిభను చాటుకోవాలనుకునే యువ ఫిలిం మేకర్లకు ఈ ఛాలెంజ్ ఒక అద్భుత వేదికగా ఉపయోగపడుతుందన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రతిబింబించేలా షార్ట్ ఫిలింలను రూపొందించవచ్చని తెలిపారు. ఈ పోటీల్లో యువ దర్శకులు, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలని ఆకాంక్షించారు.

Advertisement
Komatireddy Venkat Reddy
Bathukamma Young Film Makers Challenge 2026
Telangana Culture
Short Film Contest
Telangana Film Development Corporation
Bathukamma Festival 2026

More Telugu News