నల్సార్ విద్యార్థులకు భారీ ఊరట.. బీసీఐకి సుప్రీంకోర్టు మొట్టికాయలు
న్యాయ విద్యార్థులపై చర్యలు తీసుకునే అధికారం బీసీఐకి లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐని ఆహ్వానించడాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు
నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థులను ఎన్‌రోల్ చేయవద్దని బీసీఐ చైర్మన్ ఆదేశం
బీసీఐ అధికారాలు న్యాయవాదులకే వర్తిస్తాయని, విద్యార్థులకు కాదని తీర్పు

న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే చట్టపరమైన అధికారం భారత బార్ కౌన్సిల్ (బీసీఐ)కు లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ మేరకు నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు భారీ ఊరటనిస్తూ కీలక తీర్పు వెలువరించింది. బీసీఐ అధికార పరిధి కేవలం న్యాయవాదులుగా నమోదైన వారికి మాత్రమే పరిమితమని, విద్యార్థి దశలో ఉన్నవారికి ఇది వర్తించదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని నల్సార్ వైస్-ఛాన్సలర్‌ను ఆదేశించారు. అంతటితో ఆగకుండా, నల్సార్ 2026 బ్యాచ్‌కు చెందిన ఏ విద్యార్థినీ న్యాయవాదిగా నమోదు చేసుకోవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు సర్క్యులర్ జారీ చేశారు.
ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రావడంతో మనన్ కుమార్ మిశ్రా ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బీసీఐ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన ధర్మాసనం, విద్యార్థులపై చర్యలు తీసుకునే అధికారం బీసీఐకి లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నల్సార్ విద్యార్థులకు పెద్ద ఉపశమనం లభించింది.