కొండా సురేఖకు బిగ్ షాక్.. క్యాబినెట్ నుంచి బర్తరఫ్?
- కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించాలని నిర్ణయం
- సీఎంవో నుంచి రాజ్‌భవన్‌కు లేఖ వెళ్లినట్లు సమాచారం
- రాజీనామాకు సురేఖ అంగీకరించకపోవడంతో చర్యలు
- సురేఖ కుటుంబ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో విభేదాలు
- కఠిన చర్యలు ప్రతిపాదిస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి లోక్‌భవన్‌కు లేఖ వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి సీఎంవోకు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖను అధిష్ఠానం కోరినట్లు సమాచారం. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎంవో లేఖను రాజ్‌భవన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాసేపట్లో గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వ్యవహారం వెనుక కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సురేఖ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి.
ఈ పరిణామాలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధిష్ఠానం కఠినమైన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దలను కోరినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు బర్తరఫ్ ప్రక్రియ పూర్తయితే కొండా సురేఖ తదుపరి అడుగు ఏంటన్నదే ఆసక్తికరంగా మారింది. ఆమె పార్టీ అధిష్ఠానంతో పోరాడతారా? లేక భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటారా? అన్నది ఉత్కంఠగా మారింది.