Advertisement

రెండ్రోజుల పాటు పులివెందులలో జగన్ పర్యటన

YS Jagan Mohan Reddy two day visit to Pulivendula
  • సెప్టెంబర్ 1, 2 తేదీల్లో వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
  • ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులు
  • పర్యటనలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండనున్న మాజీ సీఎం
వైసీపీ అధినేత జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఈ పర్యటన జరగనుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు.

పర్యటన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జగన్ పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆ రోజు రాత్రికి పులివెందులలోని తన నివాసంలోనే బస చేస్తారు.

ఇక సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలుదేరి 7:45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. వర్ధంతి కార్యక్రమం పూర్తయిన అనంతరం జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతీ ఏటా వైఎస్సార్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు జగన్ హాజరై నివాళులు అర్పించడం తెలిసిందే.
Advertisement
YS Jagan Mohan Reddy
Pulivendula Visit
YS Rajasekhara Reddy Vardhanthi
Idupulapaya YSR Ghat
YSRCP
Andhra Pradesh Politics

More Telugu News