నేపాల్ వరదలు: జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద 93 మంది కార్మికుల గల్లంతు
- నేపాల్ వరదల్లో గల్లంతైన కార్మికుల కోసం గాలింపు ముమ్మరం
- రసువాగఢి హైడ్రో ప్రాజెక్టు టన్నెల్‌ను పరిశీలించిన రెస్క్యూ బృందాలు
- థర్మల్ డ్రోన్లతో గాలించినా సొరంగంలో ఎవరూ లేరని నిర్ధారణ
- ప్రాజెక్టుకు చెందిన 93 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాని వైనం
నేపాల్‌ను అతలాకుతలం చేసిన వరదల్లో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రసువా జిల్లాలోని భోటే కోశీ నదికి వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైన కార్మికుల కోసం రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో గాలింపు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు. ఈ ప్రాజెక్టుకు చెందిన 93 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.
నేపాల్ సైన్యం నేతృత్వంలోని ఇంజనీర్లు, నిపుణుల బృందం థర్మల్ డ్రోన్ల సహాయంతో దాదాపు 250 మీటర్ల పొడవైన ఈ సొరంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. టన్నెల్ చివరి వరకు గాలించినప్పటికీ లోపల ఎవరూ చిక్కుకున్న ఆనవాళ్లు కనిపించలేదని, దీంతో రెస్క్యూ బృందాలు వెనుదిరిగాయని నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.
ఆగస్టు 26న వరదలు సంభవించిన సమయంలో కార్మికులు టన్నెల్ లోపల కాకుండా, సమీపంలోని టిమురే వద్ద ఉన్న వారి నివాస క్వార్టర్లలో ఉండి ఉండొచ్చని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారిలో ప్రాజెక్టు చీఫ్, ఇతర సిబ్బందితో పాటు నిర్మాణ కార్మికులు కూడా ఉన్నారు.
ఈ వరదల కారణంగా మృతుల సంఖ్య 900 దాటగా, వేలాది మంది గల్లంతయ్యారు. భోటే కోశీ-త్రిశూలి నదీ తీరంలోని అనేక ఇతర జల విద్యుత్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికుల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ప్రభావిత ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.