ఇనుప పెనం ఉందా? ఈ ట్రిక్ తెలిస్తే నాన్‌స్టిక్ పాన్ అవసరమే ఉండదు!
- ఇనుప పెనాన్ని ఐదు దశల్లో సీజనింగ్
- ముందుగా పెనాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి
- నూనె రాసి ఉప్పుతో 2-3 నిమిషాలు వేడి చేయాలి
- తర్వాత నూనెతో మరోసారి 5-7 నిమిషాలు వేడి చేయాలి
- ఉల్లిపాయతో పెనంపై నూనె రుద్దితే పిండి అంటుకోదు
నాన్‌స్టిక్ పాన్‌పై వంట చేయడం సులభమే. కానీ, దాని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అందుకే ఇంట్లో ఉన్న సాధారణ ఇనుప పెనంతోనూ అదే తరహాలో వంట చేసుకోవచ్చు. దానికి పెనాన్ని సరిగ్గా సీజనింగ్ చేయాలి. ముఖ్యంగా దోశ, అట్టు, చపాతీ వంటి పదార్థాలు పెనానికి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..
పెనాన్ని శుభ్రం చేయాలి
ముందుగా ఇనుప పెనాన్ని వేడి నీటితో శుభ్రంగా కడగాలి. బలమైన డిటర్జెంట్లు వాడకపోవడం మంచిది. కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టాలి. తేమ మిగిలితే తుప్పు పట్టే అవకాశం ఉంటుంది.
వేడి చేసి నూనె రాయాలి
పెనాన్ని మీడియం మంటపై 2 నుంచి 3 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి నూనెల్లో ఏదో ఒకదాన్ని పెనం మొత్తం రాసుకోవాలి.
ఉప్పుతో మరోసారి సీజనింగ్
ఇప్పుడు నూనె రాసిన పెనంపై 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఉప్పు చల్లాలి. దాన్ని సమంగా పరిచి 2 నుంచి 3 నిమిషాలు వేడి చేయాలి. ఇది పెనంపై ఉన్న మలినాలను తొలగించడంలో సాయపడుతుంది. తర్వాత ఉప్పును తొలగించాలి.
మళ్లీ నూనెతో వేడి చేయాలి
పెనంపై మరోసారి నూనె రాసి తక్కువ మంటపై 5 నుంచి 7 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత పెనాన్ని నూనెతోనే చల్లారనివ్వాలి. చివరగా అదనపు నూనెను తుడిచేయాలి. ఇలా చేస్తే పెనం నాన్ స్టిక్‌గా మారి వంటకు సిద్ధమవుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చెఫ్ సంజీవ్ కపూర్ సూచనల ప్రకారం ఇనుప పెనంలో నిమ్మరసం వంటి ఆమ్ల పదార్థాలతో వంట చేయడం మంచిది కాదు. దీనివల్ల వంటకు లోహపు రుచి వచ్చే అవకాశం ఉంటుంది. వంట పూర్తయిన వెంటనే ఆహారాన్ని మరో పాత్రలోకి మార్చాలి. పెనంలోనే ఉంచితే ఆహారం నల్లగా మారవచ్చు.
దోశ పిండి అంటుకోకుండా ఉండేందుకు ఉల్లిపాయ ముక్కను నూనెలో ముంచి పెనంపై రుద్ది వేడి చేయొచ్చు. ఉల్లిపాయకు బదులుగా మస్లిన్ వస్త్రాన్ని కూడా ఉపయోగించవచ్చు.