ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉండాలా? అభిప్రాయాలు కోరిన బీసీసీఐ
- ఫ్రాంచైజీలు ఆగస్టు 31లోగా స్పందించాలని ఆదేశం
- గత సీజన్‌లో భారీ స్కోర్లతో పెరిగిన చర్చ
- బౌలర్లకు రూల్ ఇబ్బందిగా మారిందని అభిప్రాయం
- రోహిత్, హార్దిక్ సహా పలువురు వ్యతిరేకం
ఐపీఎల్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఈ అంశంపై తమ అభిప్రాయాలను చెప్పాలని బీసీసీఐ ఫ్రాంచైజీలను కోరింది. ఆగస్టు 31లోగా తమ అభిప్రాయాలను పంపాలని జట్లకు సూచించింది.
ఐపీఎల్‌లో 12వ ఆటగాడిగా మరో ప్లేయర్‌ను మ్యాచ్ మధ్యలో తీసుకునే అవకాశం ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో వచ్చింది. ఈ రూల్‌పై ఆటగాళ్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా గత సీజన్‌లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లు ఎక్కువగా కనిపించడంతో ఈ నిబంధనపై చర్చ పెరిగింది. బౌలర్లకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఇంపాక్ట్ ప్లేయర్ అంశంతో పాటు మరికొన్ని విషయాలపైనా బీసీసీఐ జట్ల అభిప్రాయాలను కోరింది. పీఎంఓఏ, అంపైరింగ్, ప్రాక్టీస్ సెషన్లు, మ్యాచ్ నిబంధనలు తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే తాజాగా పంపిన సమాచారంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి ఈ నిబంధన మరో సీజన్ కొనసాగుతుందని గతంలో సంకేతాలు వచ్చాయి. గత ఏడాది ప్రీ-సీజన్ కెప్టెన్ల సమావేశంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ పంపిన సమాచారంలో ఆ సమావేశాన్ని కూడా ప్రస్తావించింది. దీంతో రూల్ కొనసాగింపుపై కొత్తగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ వంటి పలువురు ప్రముఖ ఆటగాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను బహిరంగంగా వ్యతిరేకించారు. అదే సమయంలో ఈ రూల్‌కు మద్దతు ఇచ్చేవారు కూడా ఐపీఎల్‌లో ఉన్నారు. ఇప్పుడు ఫ్రాంచైజీల అభిప్రాయాలను బీసీసీఐ కోరడంతో వచ్చే సీజన్‌లో ఈ నిబంధన ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.