సినీ ఇండస్ట్రీలో కొత్త జంట.. ప్రేమను అధికారికంగా ప్రకటించిన కాలభైరవ, కావ్య!
- తమ ప్రేమను అధికారికంగా ప్రకటించిన కాలభైరవ, కావ్య కల్యాణ్‌రామ్
- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిన జంట
- కావ్యను ‘హోమ్’లా భావిస్తున్నానన్న కాలభైరవ
- ఆమెతో సమయాన్ని ప్రశాంతమైన అనుభూతితో పోల్చిన సింగర్
- జీవితాంతం కలిసి ఉండనున్నట్లు వెల్లడి
సినీ, సంగీత వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తున్న ఓ వార్తకు ఇప్పుడు అధికారిక ముద్ర పడింది. గాయకుడు కాలభైరవ, నటి కావ్య కల్యాణ్‌రామ్ తమ ప్రేమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను వెల్లడించారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై ఇన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.
కాలభైరవ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో కావ్యపై తనకున్న భావాలను ఎంతో అందంగా పంచుకున్నాడు. ఆమెతో సమయం గడపడం కొండల మధ్య కూర్చొని సెలయేటి ప్రవాహాన్ని చూస్తున్నంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పాడు. ఆమెతో కలిసి చేసే ప్రతి పని ముగియకూడదనిపించే విహారయాత్రలా ఉంటుందని పేర్కొన్నాడు. చలికాలపు ఉదయం తనకు ఇష్టమైన కాఫీ తాగుతున్నంత హాయిగా ఆమెతో మాట్లాడటం అనిపిస్తుందని తెలిపాడు.
ఇన్నాళ్లూ తనలో కలిగిన ఆ అనుభూతికి పేరు పెట్టలేకపోయానని కాలభైరవ చెప్పాడు. కానీ తమ ప్రయాణంలో ఓ దశలో ఆ భావన ఏంటో అర్థమైందని తెలిపాడు. అది ‘హోమ్’ అనే భావన అని వెల్లడించాడు. ‘‘నిన్ను తొలిసారి కలిసినప్పుడు కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదు. ఇంటికి వచ్చినట్లు అనిపించింది. అటుపై అక్కడి నుంచి వెళ్లలేదు’’ అంటూ కావ్యపై తన ప్రేమను వ్యక్తం చేశాడు.
తమ ప్రేమ విషయాన్ని ఇప్పుడు అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కాలభైరవ పేర్కొన్నాడు. జీవితాంతం ఇద్దరం ఒకరికొకరం ‘హోమ్’గా ఉంటామని చెప్పుకొచ్చాడు. అతడి పోస్టు అభిమానులను ఆకట్టుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నాడు.
కాలభైరవ గాయకుడిగా తెలుగు చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కావ్య కల్యాణ్‌రామ్ బాలనటిగా కెరీర్ ప్రారంభించి కథానాయికగా ఎదిగింది. ఇప్పుడు వీరిద్దరూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించడంతో ఈ జంటపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.