విజయ్ ప్రధాని అభ్యర్థిత్వం రగడ.. కాంగ్రెస్, డీఎంకే నేతల ఫైర్
- 2029లో విజయ్ ప్రధాని అభ్యర్థి అంటూ టీవీకే ప్రచారం
- దీనిపై డీఎంకేతో పాటు మిత్రపక్షం కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
- మా పీఎం అభ్యర్థి రాహుల్ గాంధీనేనని స్పష్టం చేసిన కాంగ్రెస్
తమిళనాడులో అధికార టీవీకే (తమిళిగ వెట్రి కళగం) పార్టీ, ముఖ్యమంత్రి విజయ్‌ను 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రస్తావిస్తుండడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై డీఎంకేతో పాటు మిత్రపక్షమైన కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకవేళ ఇదే ప్రచారం కొనసాగితే మంత్రివర్గం నుంచి వైదొలిగేందుకైనా వెనుకాడబోమని కాంగ్రెస్ హెచ్చరించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఇటీవల తిరుప్పూర్‌లో నిర్వహించిన ఒక సమావేశంలో టీవీకే సీనియర్ నేత, రెవెన్యూ శాఖ మంత్రి కే.ఏ. సెంగొట్టయన్ మాట్లాడుతూ, విజయ్ కేవలం తమిళనాడుకే పరిమితం కాదని, దేశాన్ని సమర్థవంతంగా నడిపించగల సత్తా ఉన్న నాయకుడని కొనియాడారు. ఆయన స్థాయి ఎంజీఆర్, జయలలితలను మించి ఉంటుందని ప్రశంసించారు. అంతేకాకుండా, టీవీకే అంతర్గతంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ప్రధాని రేసులో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తర్వాత విజయ్ మూడో స్థానంలో ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి.
ఈ పరిణాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అభ్యర్థి అని ఆ పార్టీ సీనియర్ నేత మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి టీవీకే మద్దతు తెలపని పక్షంలో తమిళనాడు మంత్రివర్గం నుంచి కాంగ్రెస్ వైదొలిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరోవైపు, డీఎంకే నేత భారతి ఈ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ, "ఊహలకు హద్దులుండవు, రేపు విజయ్ ఏకంగా ఐక్యరాజ్యసమితి చీఫ్ అవుతారని కూడా అంటారేమో" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మరో మిత్రపక్షమైన ఎండీఎంకే సైతం ఈ వాదనను వ్యతిరేకించింది. ఇండియా కూటమికి రాహుల్ గాంధీ మాత్రమే ప్రధానమంత్రి అభ్యర్థి అని, టీవీకే నేతలు ఇటువంటి ప్రచారాలను కట్టిపెట్టాలని సూచించింది. వెరసి, '2029లో విజయ్ ప్రధాని' అనే నినాదం తమిళనాడు అధికార కూటమిలో తీవ్ర చర్చకు దారితీయడమే కాకుండా, మిత్రపక్షాల మధ్య పొడచూపిన విభేదాలను బహిర్గతం చేస్తోంది.