ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ.. యుద్ధం తర్వాత తొలిసారి ముఖాముఖి చర్చలు
- ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో మోదీ భేటీ
- యుద్ధం తర్వాత తొలిసారి ముఖాముఖి సమావేశం
- హర్మూజ్ జలసంధిపై చర్చ జరిగి ఉండొచ్చని అంచనా
- ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదన్న పెజెష్కియాన్
- అర్మేనియా ప్రధాని పషిన్యాన్‌తోనూ మోదీ భేటీ
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫిబ్రవరిలో ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, పెజెష్కియాన్ ముఖాముఖిగా సమావేశం కావడం ఇదే తొలిసారి.
ఇరువురు నేతలు ఏ అంశాలపై చర్చించారనే విషయం పూర్తిగా వెల్లడికాలేదు. అయితే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ విధించిన దిగ్బంధం చర్చల్లో ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. కిర్గిజిస్థాన్ పర్యటన తొలి దశలో మోదీతో పెజెష్కియాన్ సమావేశమై చర్చలు జరిపినట్లు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది.
బిష్కెక్ బయలుదేరే ముందు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. అయితే తమపై జరిగే దాడులకు బలంగా, దృఢంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో అస్థిరత అన్ని దేశాలకు నష్టమేనని అన్నారు. ఆర్థిక, భద్రతా లక్ష్యాల కోసం దేశాల మధ్య సహకారం అవసరమని పేర్కొన్నారు.
అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థికం, ఔషధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచే అంశాలపై చర్చించారు. పశ్చిమాసియాలో పరిస్థితితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అర్మేనియాతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు.
తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ భేటీ కానున్నారు. కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఆరో ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలోనూ మోదీ పాల్గొననున్నారు.