విద్యార్థుల కంటే మంత్రుల కుక్కలకే మెరుగైన వసతులు: సీజేపీ నేత
- మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై తీవ్ర విమర్శలు
- విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్
- 'స్కూల్ ఠీక్ కరో' పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రచారం
- మంత్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించాలని సూచన
మంత్రుల నివాసాల్లోని పెంపుడు జంతువులకు ఉన్న సౌకర్యాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు కరవయ్యాయని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిగతులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో విఫలమైన విద్యాశాఖ మంత్రి దాదా భూసే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీజేపీ గత వారం చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ (పాఠశాలలను బాగు చేయండి) ప్రచారంలో భాగంగా.. దీప్కే నిన్న లాతూర్ జిల్లా ఉజని గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికశాతం పాఠశాలల్లో తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కూడా మృగ్యమయ్యాయని ఆరోపించారు. కొన్నిచోట్ల విద్యార్థుల పరిస్థితి జంతువుల కంటే హీనంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపినప్పుడే సామాన్య విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు వారికి అర్థమవుతాయని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అలా జరిగినప్పుడే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.