మత్స్యకారుల గల్లంతుపై చంద్రబాబు సీరియస్.. ఎస్‌వోపీ అమలు చేయాలని ఆదేశం
- కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
- ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన ఎస్‌వోపీ అమలు చేయాలని అధికారులకు ఆదేశం
- మత్స్యకారుడు అప్పన్న కోసం గాలింపు ముమ్మరం చేయాలన్న హోంమంత్రి అనిత
- కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న విస్తృత గాలింపు చర్యలు
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వ భరోసా
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP-Standard Operating Procedure) అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై గురువారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
సమీక్ష సందర్భంగా చంద్రబాబు పలు కీలక ప్రశ్నలను అధికారులపై సంధించారు. "బోటులో ట్రాన్స్‌పాండర్ ఏమైంది? ఆ బోటు ఒక్కటే ఎందుకు వేటకు వెళ్లింది? గల్లంతైనట్లు సమాచారం ఎప్పుడు అందింది? గాలింపు చర్యలు ఎప్పుడు ప్రారంభించారు?" అంటూ లోతుగా ఆరా తీశారు. కేవలం ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు నివారణ చర్యలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.
ఈ నెల 3వ తేదీన అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. సాధారణంగా 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, గడువు దాటినా వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన బోటులో 15 రోజులకు సరిపడా రేషన్, వెయ్యి లీటర్ల డీజిల్ ఉన్నాయని, ప్రాథమిక సమాచారం ప్రకారం బోటు విశాఖ లేదా పారాదీప్ వైపు వెళ్లి ఉండవచ్చని జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ తెలిపారు.
ప్రస్తుతం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమీక్ష సందర్భంగా చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక లోపాలు, భద్రతా వైఫల్యాలపై దృష్టి సారించాలని సూచించారు.
గల్లంతైన మత్స్యకారుల వివరాలు: కోపనాతి రామకృష్ణ (కొమరగిరిపట్నం), సంఘాని తాతారావు (బలుసుతిప్ప), పాలెపు శాంతారావు (ఓడలరేవు), ఏసుదాస్ (అడగట్లపాలెం), కొల్లాటి శ్రీనివాస్ (ఓడలరేవు), కాటాడి సతీశ్ (పశువులంక), కర్రి రాముడు (నక్క రామేశ్వరం). వీరి ఆచూకీ కోసం అధికారులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు.