ఆవేశంలో అలా అన్నాను.. ఆర్మీకి క్షమాపణ చెప్పిన లడఖ్ 'వి ఆర్ జెన్-జీ' యువతి
- కార్గిల్ విజయ్ దివస్ భద్రత కారణంగా ఆరు గంటలు ట్రాఫిక్ ఆపడంతో ఆగ్రహం
- ఆవేశంలోనే అలా మాట్లాడానని, అది చాలా తప్పని వెల్లడి
- భారత సైన్యానికి, పోలీసులకు బహిరంగంగా క్షమాపణలు
- సోషల్ మీడియా దాడితో డిప్రెషన్‌లోకి వెళ్లానని ఆవేదన
లడఖ్‌లో 'వీ ఆర్ జెన్ జీ' అంటూ భారత సైనికులతో వాగ్వాదానికి దిగి, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలైన యువతి తాజాగా బహిరంగ క్షమాపణలు కోరింది. ఆవేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, భారత సైన్యం, జమ్మూ కశ్మీర్, లడఖ్ పోలీసులకు ఆమె క్షమాపణలు తెలిపింది. సదరు వీడియో వైరల్ అయిన అనంతరం తొలిసారిగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించింది.
లడఖ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న క్రమంలో, కార్గిల్ విజయ్ దివస్ (జులై 26) పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వీఐపీ భద్రత దృష్ట్యా ద్రాస్ ప్రాంతంలోని మినీమార్గ్ చెక్‌పోస్ట్ వద్ద తమ వాహనాలను నిలిపివేసినట్లు ఆ 25 ఏళ్ల యువతి వివరణ ఇచ్చింది. సుమారు ఆరు గంటల పాటు నిరీక్షించాల్సి రావడం, అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపింది. "ఆవేశంలో నేను చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కావు, అది ముమ్మాటికీ తప్పే" అని ఆమె అంగీకరించింది.
పరిసరాల్లో ఉన్న వ్యక్తులు రెచ్చగొట్టడంతో అప్రయత్నంగానే 'జెన్ జీ' అనే పదం వాడానని, అంతకుమించి తనకు మరే ఇతర ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్ తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, మానసిక ఒత్తిడికి లోనయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. 'ఈ వేదిక ద్వారా దేశ ప్రజలకు, భారత సైన్యానికి, జమ్మూ కశ్మీర్, లడఖ్ పోలీసులకు, ముఖ్యంగా ఒమర్ అబ్దుల్లాకు మరోసారి క్షమాపణలు చెబుతున్నాను. నా ప్రవర్తన వల్ల ఇంతమంది మనస్తాపానికి గురికావడం నన్ను సిగ్గుపడేలా చేస్తోంది" అని ఆమె పేర్కొంది.