భగ్గుమన్న బంగారం ధర.. ఒక్కరోజే రూ.4,300 పెరుగుదల
- మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరిన పసిడి
- 10 గ్రాముల బంగారం ధర రూ. 1.62 లక్షలకు జంప్
- కిలో వెండి ధరపై ఏకంగా రూ. 10,000 పెరుగుదల
- అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుతున్న ధరలు
దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కేవలం ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు, మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గురువారం 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 4,300 నుంచి రూ. 4,600 వరకు పెరుగుదల నమోదైంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,000 మార్కును తాకగా, అంతకుముందు రోజు ఇది రూ. 1,58,000 వద్ద ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా రూ. 10,000 మేర పెరిగి రూ. 2,45,000కు చేరుకుంది. గత ఏడు వారాల కాలంలో వెండి ధర ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలే బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనపడటం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గడం వంటి అంశాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతుండటంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.