హిజ్రా వేషంలో ఇంట్లోకి చొరబడి మహిళపై అత్యాచారం
- ట్రాన్స్‌జెండర్ వేషంలో ముంబైలో మహిళపై లైంగిక దాడి
- పూజల పేరుతో ఇంట్లోకి చొరబడిన నిందితుడు
- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి అరెస్ట్
- నిందితుడు ట్రాన్స్‌జెండర్ కాదని, పురుషుడేనని నిర్ధారణ
ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తూ ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముంబై పోవైలోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 19న జరిగిందీ ఘటన. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, అనిల్ శేషారావు షిండే (28) అనే వ్యక్తి చీర కట్టుకుని, తాను ట్రాన్స్‌జెండర్‌నని చెప్పి పోవైలోని ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారికి దిష్టి తీస్తానని లేదా పిల్లలు లేనివారికి పూజలు చేస్తానని నమ్మించి లోపలికి వెళ్లాడు.
లోపలికి వెళ్లిన తర్వాత మహిళను బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి బెదిరించాడు. పూజ చేస్తున్నట్లు నటిస్తూ, ఆమె తలపై చేయి పెట్టి, నీళ్లు చల్లి కింద పడుకోమని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంట్లో నుంచి కొంత డబ్బు తీసుకుని పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదుతో పోవై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి, నిందితుడు ఆటోలో థానేలోని కల్వా ప్రాంతానికి పారిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 20న తెల్లవారుజామున అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు ట్రాన్స్‌జెండర్ కాదని, పురుషుడేనని పోలీసులు తేల్చారు. గతంలో కూడా ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.