టీటీడీ నెయ్యి వివాదం.. సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువునష్టం దావా
- సజ్జలపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన సంగం డెయిరీ
- టీటీడీకి నెయ్యి సరఫరాపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆక్షేపణ
- సజ్జలతో పాటు ఎమ్మెల్సీ మాధవరావు, సాక్షి టీవీపైనా కేసు
- గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన డెయిరీ ఎండీ
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ సంగం డెయిరీ రూ. 10 కోట్ల సివిల్ పరువునష్టం దావా వేసింది. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రైతుల నుంచి పాలు సేకరించకుండానే సంగం డెయిరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా చేస్తోందని ఇటీవల సజ్జల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సంగం డెయిరీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని రైతుల నుంచి ఆవు పాలను సేకరించి, అత్యంత నాణ్యమైన నెయ్యిని టీటీడీకి అందిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, సంగం డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గోపాలకృష్ణన్ గుంటూరు కోర్టును ఆశ్రయించారు. సజ్జల చేసిన వ్యాఖ్యలు సంస్థ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడమే కాకుండా, టీటీడీకి సరఫరా చేసే నెయ్యి విషయంలో భక్తుల మనోభావాలను కూడా గాయపరిచాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌లో సజ్జలతో పాటు, ఇదే తరహా ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు, ఈ వ్యాఖ్యలను ప్రసారం చేసిన సాక్షి టీవీ, ఇతర సోషల్ మీడియా వేదికలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సంస్థ ప్రతిష్ఠను కాపాడుకునేందుకే న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు సంగం డెయిరీ యాజమాన్యం వెల్లడించింది.