‘స్పిరిట్’లో ప్రకాశ్ రాజ్ లేరు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
- ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం నుంచి ప్రకాశ్ రాజ్ తొలగింపు
- ఈ విషయాన్ని ధ్రువీకరించిన నిర్మాత ప్రణయ్ వంగా
- జైలర్ పాత్ర వర్క్ అవుట్ కాలేదని వెల్లడి
- సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ లేదని స్పష్టత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ చిత్రం నుంచి ఒక కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నటించడం లేదని అధికారికంగా స్పష్టత వచ్చింది. చిత్ర నిర్మాత ప్రణయ్ వంగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ చిత్రంలోని జైలర్ పాత్ర కోసం తొలుత ప్రకాశ్ రాజ్‌ను సంప్రదించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది విడుదలైన టీజర్‌లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ వినిపించడంతో ఆయన ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని అందరూ భావించారు. అయితే, ఆ తర్వాత ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా నిర్మాత చేసిన ప్రకటనతో ఆ వార్తలకు బలం చేకూరినట్లయింది.
మరోవైపు ‘స్పిరిట్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు కూడా ప్రణయ్ వంగా తెరదించారు. ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి క్యామియో చేయడం లేదని ఆయన తేల్చి చెప్పారు.