7,050mAh బ్యాటరీ.. 12జీబీ ర్యామ్.. ఐకూ కొత్త ఫోన్ వచ్చేసింది!
- ఫోన్ ప్రారంభ ధర రూ.34,999
- 6.83 అంగుళాల 1.5K కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్
- వెనుక 50MP మెయిన్, ముందు 32MP సెల్ఫీ కెమెరా
- ఆగస్టు 25 నుంచి ఫోన్ అమ్మకాలు
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐకూ మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఐకూ Z11 పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్, 7,050mAh భారీ బ్యాటరీ, 144Hz కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.34,999గా కంపెనీ నిర్ణయించింది.
ఐకూ జెడ్11 ధరలు వేరియంట్‌ను బట్టి మారుతాయి. 6జీబీ+128జీబీ మోడల్ రూ.34,999, 8జీబీ+128జీబీ రూ.39,999, 8జీబీ+256జీబీ రూ.44,999గా ఉన్నాయి. ఇక టాప్ ఎండ్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.49,999. లాంచ్ ఆఫర్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.1,000 కూపన్ లభిస్తుంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఆగస్టు 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఐకూ ఇండియా వెబ్‌సైట్, రిలయన్స్ డిజిటల్, ఐకూ, వివో రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి.
ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5కే 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు హెచ్‌బీఎం బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌కు గరిష్ఠంగా 12జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ జత చేశారు.
గేమింగ్, హెవీ టాస్క్‌ల సమయంలో వేడిని నియంత్రించేందుకు 3,800 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్‌ఓఎస్ 6తో పనిచేసే ఈ ఫోన్‌కు మూడేళ్ల ఓఎస్ అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.
కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు 50MP సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరా, ఓఐఎస్, f/1.79 అపెర్చర్‌తో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియోలను 30fps వద్ద రికార్డ్ చేయొచ్చు.
కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి వంటి ఫీచర్లు ఉన్నాయి. 7,050mAh బ్యాటరీకి 44W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ ఉంది.