లక్షల్లో నష్టపోయాను .. మళ్లీ మా ఊరెళ్లిపోవాలనిపిస్తుంది:నటుడు అంజిమామ!

Anjimama Interview
  • నటుడిగా అంజిమామకి మంచి పేరు
  • సినిమాలలో ప్రయత్నాలు ఆపలేదని వెల్లడి
  • అప్పుల పాలయ్యానంటూ ఆవేదన   
  • ఈజీమని దిశగా ఆలోచన చేయవద్దన్న అంజిమామ
  • క్యాబ్ నడుపుతున్నానని వివరణ 

'మా విలేజ్ షో' నుంచి పాప్యులర్ అయిన నటుడే అంజిమామ. తనదైన యాసతో చాలా సహజంగా నటించే అంజిమామ, ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. అలాంటి అంజిమామ తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు." కష్టపడటం నాకు మొదటి నుంచి అలవాటే. ప్లంబర్ గా .. ఎలక్ట్రీషియన్ గా .. ఆర్ ఎంపీ గా డాక్టర్ పనిచేశాను. ఆ తరువాత వాటర్ ప్లాంట్ పెట్టాను. అయినా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాను" అని అన్నారు. 

"ఆ తరువాత స్నేహితులతో కలిసి ఈజీమని కోసం ఒక స్కీమ్ లో పెట్టుబడి పెట్టాను. దాంతో 24 లక్షల నష్టం వచ్చింది. మంచి జీవితం కోసం .. త్వరగా ఎదగాలనే కోరికతో ఈజీమని దిశగా ఆలోచన చేయడం జరిగింది. కానీ అనుభవంతో చెబుతున్నాను. ఈజీమని దిశగా ఎవరూ వెళ్లకూడదు. ఆ దిశగా ఎవరినీ ఎంకరేజ్ చేయకూడదు. ఆ ఎఫెక్ట్ కారణంగా జీవితంలో నేను మరిన్ని కష్టాలు పడవలసి వచ్చింది" అని ఆయన చెప్పారు. 

" ఒక వైపున నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతున్నాను. ఎందుకంటే నెల కాగానే ఇంటికి 50 వేలు పంపించవలసి ఉంటుంది. క్యాబ్ నడిపేటప్పుడు మాస్క్ పెట్టుకున్నా నన్ను కొంతమంది గుర్తుపడుతున్నారు. ఈ కష్టాలన్నీ ఎందుకు .. నా ఊరెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఒక ఎకరం పొలం .. నాలుగు బర్రెలు ఉంటే హాయిగా బ్రతకొచ్చని అనిపిస్తుంది" అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.

Advertisement
Anji Mama
My Village Show
Telugu actor
Easy money scheme loss
Hyderabad cab driver
Actor Anji Mama interview

More Telugu News