మోదీ, అమిత్ షాల రాజకీయ అధ్యాయం ముగిసింది: రాహుల్ గాంధీ

Rahul Gandhi says the political chapter of Modi and Amit Shah has ended
  • ఎన్డీయేలో బీజేపీ ఆధిపత్యం క్షీణించిందన్న రాహుల్
  • మోదీ, అమిత్ షా రాజకీయ ఆధిపత్యం తగ్గిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని వెల్లడి

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయేలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం క్షీణించిందని... మోదీ, అమిత్ షా రాజకీయ ప్రయాణం ముగిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


కేంద్రంలో బీజేపీకి స్వతంత్రంగా మెజారిటీ లేకపోవడం వల్ల ఆ పార్టీ రాజకీయ శక్తి, పట్టు పూర్తిగా తగ్గిపోయాయని ఆయన విమర్శించారు. గతంలో చూపిన రాజకీయ ఆధిపత్యాన్ని మోదీ, అమిత్ షా జోడీ ఇప్పుడు కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ, 'ఇండియా' కూటమి మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisement
Rahul Gandhi
Narendra Modi
Amit Shah
Congress Party
INDIA Alliance
BJP Political Dominance

More Telugu News