పార్లమెంట్‌లో స్కిట్: రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలపై కోర్టులో ఫిర్యాదు
- రాహుల్ గాంధీ సహా ఐదుగురు విపక్ష ఎంపీలపై బీహార్ కోర్టులో ఫిర్యాదు
- అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై స్కిట్ వేయడంపై అభ్యంతరం
- మత మనోభావాలను దెబ్బతీశారంటూ న్యాయవాది రాజీవ్ రంజన్ పిటిషన్
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు మరో నలుగురు విపక్ష ఎంపీలపై బిహార్‌లోని ఒక కోర్టులో ఫిర్యాదు నమోదైంది. అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఒక స్కిట్ ప్రదర్శించిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు దాఖలైంది. వారి చర్య సనాతన ధర్మ అనుచరుల మనోభావాలను దెబ్బతీసిందని పిటిషనర్ ఆరోపించారు.
జమూయి సివిల్ కోర్టులో సీనియర్ న్యాయవాది రాజీవ్ రంజన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 1004/2026 నంబర్‌తో ఈ కేసు నమోదైంది. దీనిపై తదుపరి విచారణ తేదీని కోర్టు త్వరలో ఖరారు చేయనుంది. ఈ ఫిర్యాదులో రాహుల్ గాంధీతో పాటు పూర్నియా స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు అవధేశ్ ప్రసాద్, రుచి వీర, ధర్మేంద్ర యాదవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
"రాహుల్ గాంధీ, పప్పు యాదవ్ తదితరులు సనాతన ధర్మ అనుచరుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. తమను తాము హైలైట్ చేసుకోవడానికే ఎంపీలు ఈ నాటకాన్ని ప్రదర్శించారు" అని న్యాయవాది రాజీవ్ రంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జులై 31న లోక్‌సభ మకర్ ద్వార్ వెలుపల ఈ స్కిట్‌ను ప్రదర్శించారు. ఇందులో పప్పు యాదవ్ పూజారి వేషధారణలో ఒక విరాళాల పెట్టెతో కూర్చోగా, రాహుల్ గాంధీ సహా ఇతర ఎంపీలు భక్తులుగా వచ్చి అందులో డబ్బులు వేశారు. ఆ తర్వాత పప్పు యాదవ్ ఆ డబ్బును తన జేబులో వేసుకోవడం, దాన్ని మరో ఎంపీ ప్రశ్నించడం వంటి సన్నివేశాలను ప్రదర్శించారు.