యూపీఐపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. ఎవరిపై ప్రభావం?
- యూపీఐ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- వాయిస్ ఓటుతో చర్చ లేకుండానే బిల్లు పాస్
- యూపీఐపై ఛార్జీలకు చట్టపరమైన మార్గం
- ఎండీఆర్ మినహాయింపు నిబంధన తొలగింపు
- పెద్ద వ్యాపారులకే ఛార్జీలు వర్తించే అవకాశం
- సాధారణ వినియోగదారులకు ప్రభావం ఉండదని సంకేతాలు
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి కీలక మార్పులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశానికి మార్గం సుగమం చేసే ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ (సవరణ) బిల్లు-2026’ను లోక్‌సభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లు పాస్ అయింది.
ప్రస్తుతం యూపీఐ సహా కొన్ని డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) వసూలు చేయకుండా చట్టపరమైన నిబంధన ఉంది. తాజా సవరణతో ఆ నిబంధన తొలగనుంది. దీంతో భవిష్యత్‌లో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం ఏర్పడింది.
ప్రస్తుతం ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై సేవా రుసుములు అమల్లో ఉండగా, యూపీఐకి మాత్రం మినహాయింపు ఉంది. కొత్త బిల్లుతో ఆ పరిస్థితి మారనుంది.
అయితే ఈ ఛార్జీలు సాధారణ వినియోగదారులపై కాదు. నిర్దిష్ట పరిమితికి మించిన యూపీఐ లావాదేవీలు చేసే పెద్ద వ్యాపారులు, వ్యాపార సంస్థలకే వర్తించే అవకాశం ఉందని సమాచారం. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, మౌలిక సదుపాయాల సంస్థలకు ఆదాయం సమకూర్చడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
ఛార్జీల శాతం, ఏ స్థాయి లావాదేవీలకు వర్తిస్తాయనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు తర్వాత స్పష్టత ఇవ్వనున్నాయి.