అసోంలో ఇద్దరు జవాన్లను కాల్చిచంపి.. ఆంధ్రప్రదేశ్ సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మహత్య

Andhra Pradesh CRPF officer kills two jawans and commits suicide in Assam
  • అసోంలో తోటి జవాన్లపై కాల్పులు జరిపిన ఏపీ అధికారి
  • ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
  • అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఏఎస్ఐ
  • నాగావ్ జిల్లాలోని 34వ బెటాలియన్ క్యాంపులో ఘటన
  • ఘటనపై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల విచారణ ప్రారంభం
అసోంలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీఆర్పీఎఫ్ అధికారి ఇద్దరు తోటి జవాన్లను కాల్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అసోంలోని నాగావ్ జిల్లా కతిమరిలో గల సీఆర్పీఎఫ్ 34వ బెటాలియన్ క్యాంపు ప్రధాన ద్వారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏఎస్ఐ బల్లాని ప్రేమాంబరం విధుల్లో ఉన్న తోటి జవాన్లపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి.

అనంతరం ప్రేమాంబరం అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతంతో క్యాంపులో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాల్పులకు దారితీసిన కారణాలపై విచారణ ప్రారంభించారు.
Advertisement
Ballani Premambaram
CRPF shooting Assam
Nagaon district firing
Andhra Pradesh CRPF officer
CRPF 34th Battalion

More Telugu News