ప్రీతి జింటాతో డేటింగ్‌? ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్‌ లీ

Dating Preity Zinta Brett Lee finally opens up about rumors
  • ప్రీతి జింటాతో ప్రేమ ప్రచారంపై తొలిసారి స్పందించిన బ్రెట్‌ లీ
  • ప్రీతితో ఉన్నది స్నేహం మాత్రమేనని వెల్లడి
  • ఆమెపై తనకు ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్య
  • ప్రేమ ప్రచారాన్ని తాను పట్టించుకోలేదని వెల్లడి
  • పంజాబ్‌ కింగ్స్‌తో బ్రెట్‌ లీ ఆడిన సమయంలోనే మొదలైన ఊహాగానాలు
  • గతంలోనే ఖండించిన ప్రీతి
బాలీవుడ్‌ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమాయణం నడిచిందనే ప్రచారానికి ఎట్టకేలకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీ తెరదించాడు. చాలా ఏళ్లుగా వస్తున్న ఆ ఊహాగానాలపై స్పందించిన అతడు.. తమ మధ్య ఉన్నది స్నేహమేనని స్పష్టం చేశాడు. ప్రీతిపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పాడు.

పంజాబ్‌ కింగ్స్‌కు ప్రీతి జింటా యజమానిగా ఉన్న రోజుల్లో తాము దగ్గరగా కనిపించడంతో ఎన్నో కథనాలు వచ్చాయని బ్రెట్‌ లీ గుర్తు చేసుకున్నాడు. తాజాగా బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రచారంపై నేరుగా స్పందించాడు.

‘‘నేను ఎప్పుడూ ఏ బాలీవుడ్‌ నటితోనూ డేటింగ్‌ చేయలేదు. ప్రీతి ఎప్పుడూ నా మంచి స్నేహితురాలే. ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతోంది. ఆమె చాలా తెలివైన మహిళ. ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి ప్రచారాలు నన్నెప్పుడూ ప్రభావితం చేయలేదు. నిజం నాకు తెలుసు. ఎవరు ఏం అనుకున్నా పట్టించుకోలేదు’’ అని బ్రెట్‌ లీ చెప్పాడు.

2008 నుంచి 2011 మధ్య పంజాబ్‌ కింగ్స్‌కు బ్రెట్‌ లీ ఆడిన సమయంలో ఈ ప్రచారం ఎక్కువైంది. ముంబైలో ఓ రెస్టారెంట్‌ వద్ద ఇద్దరూ కలిసి కనిపించిన తర్వాత ప్రేమలో ఉన్నారనే వార్తలు మరింత ఊపందుకున్నాయి.

అయితే 2010లోనే ప్రీతి జింటా ఈ ప్రచారాన్ని ఖండించింది. ‘‘ప్రతి ఏడాది బ్రెట్‌ లీతో నేను ప్రేమలో ఉన్నట్టు చెప్పడం పాత వార్త అయిపోయింది. అలాంటిదేమీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే’’ అంటూ అప్పట్లో సోషల్‌ మీడియాలో స్పష్టం చేసింది.

బ్రెట్‌ లీ 2006లో ఎలిజబెత్‌ కెంప్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. రెండేళ్లకే ఇద్దరూ విడిపోయారు. 2009లో విడాకులు తీసుకున్నారు. తర్వాత 2014లో లానా ఆండర్సన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ప్రీతి జింటా 2016లో అమెరికాలో జీన్‌ గుడ్‌ఇనఫ్‌ను వివాహం చేసుకుంది. 2021లో సరోగసీ ద్వారా కవలలకు తల్లయ్యారు.

ప్రీతి జింటా ప్రస్తుతం ‘బట్వారా 1947’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Brett Lee
Preity Zinta
Punjab Kings
Bollywood dating rumors
IPL cricket news
Brett Lee interview

More Telugu News