ఉదయనిధికి హైకోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు
- ఉదయనిధికి మద్రాస్ హైకోర్టు బెయిల్
- ఈరోజే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశం
- విచారణకు సహకరించాలని కోర్టు సూచన
- రిమాండ్‌కు పంపే ఆలోచన లేదన్న పోలీసులు
- ఎఫ్‌ఐఆర్ నేపథ్యంలోనే విచారణ చేపట్టినట్లు వెల్లడి
- విచారణ పూర్తికాగానే విడుదల చేస్తామన్న పోలీసులు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈరోజే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే విచారణకు పూర్తిగా సహకరించాలని ఉదయనిధికి సూచించింది.
ముఖ్యమంత్రి విజయ్, సినీ నటి త్రిషకు సంబంధించిన వ్యాఖ్యల ఆరోపణల కేసులో ఈరోజు పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఉదయనిధిని రిమాండ్‌కు పంపే ఆలోచన తమకు లేదని తమిళనాడు పోలీసులు స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన నేపథ్యంలో మాత్రమే ఆయన్ను విచారిస్తున్నామని తెలిపారు. విచారణ పూర్తైన వెంటనే విడుదల చేస్తామని కూడా వెల్లడించారు.