నాకు అంత సమయం లేదు!: విపక్షాల ఐక్యత అంశంపై ప్రశాంత్ కిశోర్
- బీహార్ బంకీపుర్ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ విజయం
- మూడు నెలల్లో నియోజకవర్గంలో మార్పు చూపిస్తానని హామీ
- తన దృష్టి బీహార్ అభివృద్ధిపైనేనని, విపక్షాల ఐక్యతపై కాదని స్పష్టీకరణ
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, 'జన సురాజ్' పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లో సంచలన విజయం సాధించారు. బీహార్‌లోని బంకీపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన బీజేపీ అభ్యర్థిపై 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీకి కంచుకోటగా భావించే ఈ స్థానంలో పీకే గెలుపొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడం బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారినప్పటికా, ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది.
ఎన్నికల ఫలితాల అనంతరం ప్రశాంత్ కిశోర్ విపక్ష పార్టీల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విపక్షాల ఐక్యత కోసం తాను పని చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు అంత సమయం లేదని, బీహార్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే తన ప్రధాన అజెండా అని పీకే పేర్కొన్నారు.
"ఇకపై బంకీపుర్ నియోజకవర్గ ప్రజలు తమ ప్రజాప్రతినిధి విషయంలో తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. రాబోయే మూడు నెలల్లోనే నియోజకవర్గంలో స్పష్టమైన మార్పును చూపిస్తాను. స్థానిక స్థాయిలో అవినీతిని అంతం చేస్తానని హామీ ఇస్తున్నాను" అని ఆయన తెలిపారు. ప్రజలు కులమతాలకు అతీతంగా ఓటు వేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, మొత్తం 422 పోలింగ్ బూత్‌లలో మూడింట రెండొంతుల బూత్‌లలో బీజేపీ ఓటమి పాలైందని ఆయన విశ్లేషించారు.
బీహార్ రాష్ట్రానికి సమర్థవంతమైన ముఖ్యమంత్రిని అందించడమే తన లక్ష్యమని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. "వలసల నివారణ, విద్యను ప్రోత్సహించడం, భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి లక్ష్యాలతో పనిచేసే ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రభుత్వ పాఠశాలల్లో స్థితిగతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, పేద విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునేలా తగిన వసతులు కల్పిస్తాను" అని ఆయన హామీ ఇచ్చారు.