రాయలసీమ వనరులు తీవ్రంగా దోపిడీకి గురయ్యాయి: పీవీఎన్ మాధవ్

PVN Madhav says Rayalaseema resources were severely exploited
  • రైజింగ్ రాయలసీమ కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్
  • ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది సీఎంలు వచ్చారని వ్యాఖ్య
  • రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని పిలుపు

కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో సమర్థ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైజింగ్ రాయలసీమ’ కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీమ ప్రాంత స్థితిగతులు, ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రాయలసీమ ప్రాంతం తీవ్ర వెనుకబాటుతనానికి గురైందని, ఇక్కడి ప్రాకృతిక, మానవ వనరులు దోపిడీకి గురయ్యాయని అన్నారు. 


ఈ ప్రాంతం నుంచి ఎందరో ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. రాయలసీమ అభివృద్ధిలో ఎందుకు వెనుకబడిపోయిందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు నాయకులు, మేధావులు ఒకే తాటిపైకి వచ్చి సీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని పిలుపునిచ్చారు.


సీమ పురోగతి కోసం ఆయన 'ప్రజలు, పాడిపంటలు, పరిశ్రమలు, పర్యటకం, పర్యావరణం' విధానాన్ని సూచించారు. వచ్చే 20 ఏళ్లలో రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై సమగ్ర డాక్యుమెంటరీని రూపొందించడమే కాకుండా, దాన్ని ఆచరణలో సాధించి తీరాలని అన్నారు.
Advertisement
PVN Madhav
Rayalaseema development
BJP Andhra Pradesh
Rising Rayalaseema
Rayalaseema University Kurnool
Samarth Foundation

More Telugu News