ఒలింపిక్ పతక విజేతలూ అబద్ధాలు చెబుతారు.. బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు
- బ్రిజ్ భూషణ్‌కు కోర్టులో ఊరట
- ‘‘ఇది నా విజయం కాదు’’ అన్న బ్రిజ్ భూషణ్
- ఒలింపియన్లపై సంచలన వ్యాఖ్యలు
- 2023లో రెజ్లర్ల నిరసనతో కేసు ప్రారంభం
- నిర్దోషిగా బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్
మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా తేలిన తర్వాత డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపితం కాలేదన్నారు. ఒలింపియన్‌లు, ఒలింపిక్ పతక విజేతలు కూడా తమ స్వప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతారని ఈ తీర్పుతో తేలిందని వ్యాఖ్యానించారు.
మహిళా రెజ్లర్లు నమోదు చేసిన లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో రౌస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు తర్వాత ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడిన బ్రిజ్ భూషణ్.. ఇది తన విజయం కాదని అభిప్రాయపడ్డారు. జూనియర్ రెజ్లర్ల విజయం అని వ్యాఖ్యానించారు. క్రీడాకారుల హక్కుల కోసం తాను పోరాడినందుకే తనపై ఈ ఆరోపణలు వచ్చాయని ఆరోపించారు. ఈ కేసు ఒలింపియన్‌లు, ఒలింపిక్ పతక విజేతలు కూడా తమ స్వప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతారని నిరూపించిందని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతలపై గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ప్రస్తుతం ఎవరి పేరూ ప్రస్తావించబోనని బ్రిజ్ భూషణ్ చెప్పారు. ఒకటి, రెండు పార్టీలను మినహాయిస్తే దేశంలో తనను ఉరితీయాలని, సజీవ దహనం చేయాలని డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలుసని అన్నారు. కోర్టు తనను గౌరవప్రదంగా నిర్దోషిగా ప్రకటించిందని, దోషిగా తేలితే ఉరివేసుకుంటానని గతంలో చెప్పానని, కానీ అలాంటి పరిస్థితి రాలేదని వ్యాఖ్యానించారు.
ఈ కేసు 2023 జనవరిలో ప్రారంభమైంది. ఒలింపియన్‌లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా సహా పలువురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టారు. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు చేస్తూ ఆయన రాజీనామాతో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భారత ఒలింపిక్ సంఘం విచారణ కమిటీ ఏర్పాటు చేయగా, కేంద్ర క్రీడల శాఖ డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. తాజాగా కోర్టు ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించడంతో ఈ కేసు విచారణ ముగిసింది.