20 లక్షల మార్క్ దాటిన 'ఇంటింటికీ తెలుగు దేశం -2026'... నారా లోకేశ్ హర్షం
- ఏపీలో ఎనిమిదో రోజుకు చేరిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం
- సోమవారం ఒక్కరోజే 3 లక్షలకు పైగా కుటుంబాలను కలిసిన టీడీపీ శ్రేణులు
- రెండేళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరిస్తున్న నేతలు
- క్షేత్రస్థాయిలో లభిస్తున్న ఆదరణపై నారా లోకేశ్ సంతృప్తి
- కార్యకర్తలను, నాయకులకు అభినందనలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ఇంటింటికీ తెలుగుదేశం – 2026, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం" కార్యక్రమం కీలక మైలురాయిని చేరుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 20 లక్షలకు పైగా కుటుంబాలను నేరుగా కలిసినట్లు టీడీపీ ప్రకటించింది.
ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించాయి. దీంతో ఈ కార్యక్రమం ద్వారా చేరిన మొత్తం ఇళ్ల సంఖ్య 20.61 లక్షలకు చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ప్రజాప్రతినిధులతో పాటు అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి, ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమం 20 లక్షల ఇళ్ల మార్క్‌ను దాటడంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని, ఇది కార్యక్రమంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ మైలురాయిని అధిగమించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.