పాపులర్ షూమార్ట్ అధినేత విజయ్ కుమార్ మృతి

Popular Shoemart owner Chukkapalli Vijay Kumar passes away
  • గుండెపోటుతో కన్నుమూసిన విజయ్ కుమార్
  • దిగ్భ్రాంతిలో విజయవాడ వ్యాపార వర్గాలు
  • సంతాపం వ్యక్తం చేసిన సుజనా చౌదరి

ప్రముఖ వ్యాపార సంస్థ 'పాపులర్ షూమార్ట్' అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్ ఈ ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన అకస్మాత్తుగా కన్నుమూయడంతో విజయవాడ వ్యాపార వర్గాలతో పాటు ఆయన సన్నిహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన 'పాపులర్ షూమార్ట్' గత ఆరు దశాబ్దాలకు పైగా నాణ్యమైన సేవలతో ప్రజల విశేష ఆదరణను, విశ్వాసాన్ని పొంది ప్రముఖ వ్యాపార సంస్థగా చెరగని ముద్ర వేసింది. సంస్థ పురోగతిలో విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు.


విజయ్ కుమార్ మరణవార్త తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ వ్యాపార రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.

Advertisement
Chukkapalli Vijay Kumar
Popular Shoemart
Vijayawada
Sujana Chowdary
Business leader death
Popular Shoemart owner

More Telugu News