'ఒక్కటే బాత్‌రూమ్‌.. బల్లులు కూడా ఉండేవి'.. జైలు జీవితం గుర్తుచేసుకున్న సల్మాన్‌

Salman Khan remembers jail life says there was only one bathroom and lizards
  • చిన్న గదిలో 50-60 మంది ఉండేవారని వెల్లడి
  • ఇండియన్‌ స్టైల్‌ టాయిలెట్‌ ఉండేదన్న స్టార్‌
  • కృష్ణజింక వేట కేసులో పలుమార్లు జోధ్‌పూర్‌ జైలులో ఉన్న సల్మాన్‌
  • ఈ కేసు తర్వాత లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి బెదిరింపులు
  • సోహైల్‌ను కలుసుకునేందుకు 'అలయన్స్‌' షోకు వెళ్లిన సల్మాన్‌
జైల్లో గడిపిన రోజులను బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ గుర్తు చేసుకున్నారు. జైలులో ఖైదీలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ ప్రోమోలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తన సోదరుడు సోహైల్‌ ఖాన్‌ పాల్గొంటున్న స్ట్రీమింగ్‌ రియాలిటీ షో ‘అలయన్స్‌’ సెట్స్‌కు వెళ్లిన సల్మాన్‌ అక్కడి పోటీదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు.

‘‘చాలా ఏళ్ల క్రితం నేను జైలుకు వెళ్లినప్పుడు చిన్న గదిలో 50 నుంచి 60 మంది ఉండేవాళ్లం. ఒక్కటే బాత్‌రూమ్‌ ఉండేది. ఇండియన్‌ స్టైల్‌ టాయిలెట్‌ ఉండేది. కొన్నిసార్లు బల్లులు కనిపించేవి. నీరు, మురుగు కూడా నిండిపోయి ఉండేది’’ అని సల్మాన్‌ చెప్పారు.

1998 నుంచి 2018 మధ్య కృష్ణజింక, చింకారా వేట కేసులకు సంబంధించి సల్మాన్‌ పలుమార్లు జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. 1998లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ సమీపంలో రెండు కృష్ణజింకలను వేటాడారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై బిష్ణోయ్‌ సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ కేసు కారణంగానే గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్‌కు పలుమార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల సోహైల్‌ ఖాన్‌ను కలుసుకునేందుకు ‘అలయన్స్‌’ షో సెట్స్‌కు వెళ్లిన సల్మాన్‌ డెనిమ్‌ షర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌, కౌబాయ్‌ టోపీతో సందడి చేశారు.
Advertisement
Salman Khan
Jodhpur Central Jail
Blackbuck poaching case
Sohail Khan Alliance show
Salman Khan jail experience
Bollywood star prison life

More Telugu News