కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. ఆరెస్సెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
- సీజేపీ నిరసనలు దేశ, రాజ్యాంగ వ్యతిరేకమని ఆర్‌ఎస్‌ఎస్ విమర్శ
- ఈ ఆందోళనను ఒక కేస్ స్టడీగా భావించి అధ్యయనం చేయాలని విద్యార్థులకు సూచన
- నీట్ పేపర్ లీక్ ఉద్యమం వామపక్ష శక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపణ
- వివిధ రంగాల సంస్థలను ఒకే వేదికపైకి ఎవరు తెచ్చారని ప్రశ్న
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవలే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసనలు 'దేశ వ్యతిరేకమైనవని', 'రాజ్యాంగ విరుద్ధమైనవని' రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంయుక్త ప్రధాన కార్యదర్శి అతుల్ లిమాయే అభివర్ణించారు. ఈ ఆందోళనను ఒక 'కేస్ స్టడీ'గా పరిగణించి, దానిపై లోతైన అధ్యయనం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన ఏబీవీపీ కార్యకర్తల సమావేశంలో అతుల్ లిమాయే ప్రసంగించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల్లో మొదట వ్యక్తమైన ఆగ్రహం సహజమైనదేనని, అయితే కాలక్రమేణా ఆ ఉద్యమం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"సీజేపీ ఆందోళన వెనుక ఉన్న పనితీరు, దానికి అందుతున్న మద్దతు, దాని సైద్ధాంతిక నేపథ్యం గురించి కూలంకషంగా అర్థం చేసుకోవాలి. జూన్ 20 తర్వాత ఈ నిరసనలు ఒక్కసారిగా ఏ విధంగా ఉద్ధృతమయ్యాయి అనేది గమనించాలి" అని ఆయన పేర్కొన్నారు.
ఈ నిరసనలకు మద్దతు పలికిన సంస్థల్లో అత్యధికం వామపక్ష భావజాలం ఉన్నవేనని లిమాయే ఆరోపించారు. "భారత్ తేరే తుక్డే తుక్డే" వంటి వివాదాస్పద నినాదాలు చేసే బృందాలతో సంబంధమున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) వంటి సంఘాలు ఈ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించాయని ఆయన తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన ఇన్ని సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన శక్తులు ఎవరని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.