మీకు తెలియకుండానే ఆఫీసులో మీ కెరీర్‌ను దెబ్బతీస్తున్న అలవాట్లు ఇవే..!

Habits that are damaging your career in the office without you knowing
  • ఆఫీస్‌లో ప్రవర్తన కూడా కెరీర్‌కు చాలా కీలకం
  • చిన్న అలవాట్లు ఇమేజ్‌ను ప్రభావితం చేస్తాయన్న కార్పొరేట్ ప్రొఫెషనల్ గుషి 
  • ఇతరుల పనికి క్రెడిట్ తీసుకోవద్దని సూచన
  • డెడ్‌లైన్‌లు, సమయపాలన పాటించాలని హితవు
  • గాసిప్‌, వ్యక్తిగత కాల్స్‌కు దూరంగా ఉండాలని సూచన
  • సహోద్యోగులతో మర్యాదగా వ్యవహరించాలని సలహా
ఉద్యోగంలో మంచి గుర్తింపు రావాలంటే కష్టపడటం ఒక్కటే సరిపోదు. ఆఫీస్‌లో మీ ప్రవర్తన, సహోద్యోగులతో వ్యవహరించే తీరు, సమయపాలన, బాధ్యత తీసుకునే విధానం కూడా అంతే ముఖ్యం. చాలా మంది తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు.. వారి ప్రొఫెషనల్ ఇమేజ్‌ను దెబ్బతీస్తాయి. హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ ప్రొఫెషనల్ గుషి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఉద్యోగులు దూరంగా ఉండాల్సిన 10 అలవాట్లను వివరించారు. అవేంటో తెలుసుకుందాం.

  • టీమ్‌గా చేసిన పనికి మొత్తం క్రెడిట్‌ను మీ ఖాతాలో వేసుకోవడం సరైంది కాదు. ఇతరుల కృషిని గుర్తించడం మంచి ఉద్యోగి లక్షణం.
  • పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయడం ప్రొఫెషనలిజానికి గుర్తు. ఆలస్యమైతే పదే పదే సాకులు చెప్పడం మీపై నమ్మకాన్ని తగ్గిస్తుంది.
  • పొరపాటు జరిగితే దాన్ని ఇతరులపై నెట్టేయకుండా బాధ్యత తీసుకోవాలి. తప్పును అంగీకరించడం బలహీనత కాదు. మంచి లక్షణం.
  • పని కంటే గాసిప్‌లకే ఎక్కువ సమయం కేటాయిస్తే అది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది.
  • ఇతరులు మాట్లాడుతుండగా మధ్యలో అడ్డుకోవడం మర్యాద కాదు. పూర్తిగా విన్న తర్వాత స్పందిస్తే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం కనిపిస్తుంది.
  • సహోద్యోగులతో గౌరవంగా మాట్లాడటం, మర్యాదగా ప్రవర్తించడం కార్యాలయంలో మంచి సంబంధాలను పెంచుతుంది. చిన్న మాట కూడా పెద్ద ప్రభావం చూపుతుంది.
  • తరచూ ఆలస్యంగా రావడం, పని పూర్తికాకముందే వెళ్లిపోవడం మీ నిబద్ధతపై సందేహాలు కలిగిస్తుంది. సమయానికి రావడం, సమయానికి పని పూర్తి చేయడం అవసరం.
  • అవసరానికి మించి లంచ్ లేదా టీ బ్రేక్‌లు తీసుకోవడం పనిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విరామాలకు కూడా పరిమితి ఉండాలి.
  • ఆఫీస్‌లో పెద్దగా వ్యక్తిగత ఫోన్ కాల్స్ మాట్లాడటం ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. వ్యక్తిగత విషయాలను వీలైనంత వరకు బయటే మాట్లాడటం మంచిది.
  • కాఫీ కప్పులు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువులతో డెస్క్‌ను అస్తవ్యస్తంగా ఉంచడం మంచి అభిప్రాయం కలిగించదు. పరిశుభ్రమైన వర్క్‌స్పేస్ మీ క్రమశిక్షణను చూపిస్తుంది.
  • అవసరమైన చోట మాత్రమే మాట్లాడాలి. మాటల్లో సంయమనం ఉండాలి.
Advertisement
Gushi
Workplace habits
Career growth
Office etiquette
Professionalism
Hyderabad corporate professional

More Telugu News