Advertisement

బ్యాంకు మేనేజర్ చెంప చెళ్లుమనిపించిన కరుణానిధి మనవరాలు

Kayalvizhi Karunanidhi granddaughter slaps SBI bank manager in Chennai
  • ఎస్‌బీఐ మేనేజర్‌పై చేయి చేసుకున్న కరుణానిధి మనవరాలు కాయల్విళి
  • లిఫ్ట్ పనిచేయకపోవడంపై చెలరేగిన వివాదం
  • మేనేజర్‌ను హేళన చేస్తూ, చెంపదెబ్బ కొట్టిన అళగిరి కుమార్తె
  • ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్
  • కాయల్విళిపై దాడి, బెదిరింపుల కింద కేసు నమోదు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కాయల్విళి ఓ బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్నారు. లిఫ్ట్ పనిచేయడం లేదన్న విషయంలో చెలరేగిన వివాదంలో ఆమె స్టేట్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) బ్రాంచ్ మేనేజర్‌ను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

జులై 20న చెన్నైలోని అడయార్ ఏరియాలో ఉన్న ఎస్‌బీఐ ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. బ్యాంకు ఉన్న భవనంలోని లిఫ్ట్ పనిచేయకపోవడంపై కాయల్విళి, బ్రాంచ్ మేనేజర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ భవనం కాయల్విళికి చెందినదిగా తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో ఆమె తొలుత మేనేజర్ హావభావాలను హేళన చేస్తూ అనుకరించారు, ఆ తర్వాత ఆయన చెంపపై కొట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆమెను ఆపేందుకు ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఈ ఘటనపై ఎస్‌బీఐ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్రాంచ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ ఫుటేజ్ శనివారం సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. మేనేజర్‌పై దాడి చేసి, బెదిరించిన ఆరోపణలతో కాయల్విళిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
Advertisement
Kayalvizhi
MK Alagiri daughter
Karunanidhi granddaughter
SBI bank manager slapped
Chennai Adyar SBI incident
Kayalvizhi CCTV viral video

More Telugu News