వైద్యుడికి 'డిజిటల్ అరెస్ట్' నరకం.. రూ.2 కోట్లు గుంజిన నర్స్ అరెస్ట్!
- రాజస్థాన్‌లో వైద్యుడిని బ్లాక్‌మెయిల్ చేసిన నర్స్
- ప్రైవేట్ ఫొటోలతో బెదిరించి రూ.2 కోట్లు వసూలు
- బాధితుడికి ప్రత్యేక ఫోన్ ఇచ్చి నిరంతర నిఘా
- ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాల సేకరణ
- ఆరోపణలన్నీ అబద్ధమని తోసిపుచ్చిన నిందితురాలు
రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమించే ఒక సీనియర్ డాక్టర్.. తన సొంత ఆసుపత్రిలోనే ఐదేళ్లకు పైగా తీవ్ర భయాందోళనల మధ్య ‘డిజిటల్ బందీ’గా బతికాడంటే నమ్మగలమా? రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది!
బార్మర్‌కు చెందిన 65 ఏళ్ల ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి వద్ద కమల అలియాస్ కమలేష్ అనే మహిళ 2016 నుంచి నర్సుగా పనిచేస్తోంది. నెలకు రూ.12 వేల జీతానికి పనిచేసే ఈ నర్స్, టీ తెచ్చే నెపంతో డాక్టర్ వ్యక్తిగత గదిలోకి ప్రవేశించి ఆయనకు తెలియకుండా రహస్య ఫొటోలు తీసింది.
ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, రేప్ కేసులో ఇరికిస్తానని, చంపేస్తానని బెదిరిస్తూ ఆయన నుంచి ఏకంగా రూ.2 కోట్ల వరకు గుంజినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆసుపత్రి ప్రతిష్ఠ, తన పరువు పోతుందనే భయంతో డాక్టర్ విడతల వారీగా అడిగినంత ఇస్తూ వచ్చాడు. చివరికి ఆసుపత్రి ఖాతా నుంచే ఏకంగా రూ.35 లక్షలు ఆమె అకౌంట్‌కు బదిలీ చేయడం గమనార్హం.
ఈ బ్లాక్‌మెయిలింగ్ అంతటితో ఆగలేదు. డాక్టర్‌ను పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఆ నర్స్ అతడికి ఒక ప్రత్యేక మొబైల్ ఫోన్ ఇచ్చి, 24 గంటలు దాన్ని ఆన్‌లోనే ఉంచాలని 'డిజిటల్ అరెస్ట్' చేసింది. సీసీటీవీ కెమెరాల పాస్‌వర్డ్‌లు తీసుకుని ఆసుపత్రిలో ఆయన కదలికలను ఎప్పటికప్పుడు గమనించేది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు దాదాపు 1000 సార్లు ఫోన్ చేసి వేధించడమే కాకుండా, ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించుకుని బ్యాంకు లాకర్లలో దాచుకుంది.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కమలేష్‌ను అరెస్ట్ చేసి, విచారణ వేగవంతం చేశారు. అయితే, ఆరోపణలన్నీ అబద్ధమని, తనను కావాలనే ఇరికిస్తున్నారని నిందితురాలు చెబుతుండటంతో పోలీసులు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలపై లోతుగా ఆరా తీస్తున్నారు.