Advertisement

అమెరికాలో నుదుట బొట్టుతో విధులకు.. జాత్యహంకార వ్యాఖ్యలపై డాక్టర్ ఆశ్చర్యం

Dr Karishma Reddy surprised by racist comments for wearing bindi to work in USA
  • అమెరికాలో భారత సంతతి వైద్యురాలికి చేదు అనుభవం
  • నుదుట బొట్టు పెట్టుకున్నందుకు జాత్యహంకార వ్యాఖ్యలు
  • ఆమె స్పందన సోషల్ మీడియాలో వైరల్
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వైద్యురాలు నుదుట బొట్టు ధరించినందుకు జాత్యహంకార వేధింపులకు గురయ్యారు. "భారత్‌కు తిరిగి వెళ్లిపో" అంటూ ఓ వ్యక్తి చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యకు ఆమె ఎంతో హుందాగా, దటుగా బదులిచ్చిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటన అమెరికాలో సాంస్కృతిక వైవిధ్యం, జాత్యహంకారంపై మరోసారి విస్తృత చర్చకు దారితీసింది.

వృత్తిరీత్యా వైద్యురాలైన డాక్టర్ కరిష్మా రెడ్డి, తన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ బొట్టు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో, బిందీ ధరించిన స్థితిలో ఒక రోగితో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే, ఈ వీడియోపై కొందరు నెటిజన్లు జాత్యహంకార వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

తాను అమెరికాలోనే పుట్టి పెరిగినప్పటికీ, భారతీయ సంప్రదాయాలను పాటించే క్రమంలో కొంతమంది 'భారత్‌కు తిరిగి వెళ్ళిపో' అంటూ వివక్ష చూపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య రంగంలో సహోద్యోగులు ఎంతో ఆత్మీయంగా ఉంటారని, తన వృత్తి జీవితంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి తీవ్రస్థాయి భారత వ్యతిరేక ధోరణిని ఎదుర్కోలేదని ఆమె పేర్కొన్నారు. ఆసుపత్రి వాతావరణంలో భారతీయులను మైనారిటీలుగా చూడరని, అందరూ పరస్పర గౌరవంతో మెలుగుతారని తెలిపారు. అందుకే ఈ వీడియోకు వచ్చిన విద్వేషపూరిత కామెంట్లు చూశాక, బయట నెలకొన్న పరిస్థితులు తనను విస్మయానికి గురిచేశాయని ఆమె అన్నారు.

విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆమె ఏమాత్రం సహనం కోల్పోకుండా, ఎంతో సంయమనంతో స్పందించారు. తన సాంస్కృతిక గుర్తింపు పట్ల గర్వంగా ఉందని ప్రకటిస్తూనే, ఒక వైద్యురాలిగా సమాజానికి తాను అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. పక్షపాత ధోరణిని సవాలు చేస్తూ ఆమె ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసు గెలుచుకుంది.
Advertisement
Dr Karishma Reddy
Racism in USA
Indian Doctor USA
Bindi controversy USA
Indian Diaspora
Go back to India comments

More Telugu News